SONGS ARCHIVE
SwayamVaram
Movie స్వయంవరం
Star Cast శోభన్ బాబు, జయప్రద, దాసరి నారాయణరావు
Year 1982
Lyricist దాసరి నారాయణరావు
Singer(s) K.J.ఏసుదాస్
Music సత్యం

Listen to Swayamvaram 1982 Audio Songs at MusicMazaa.com
గాలి వానలో... వాన నీటిలో...
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం

ఇటు హోరుగాలి అని తెలుసూ... అటు వరద పొంగు అని తెలుసూ...
ఇటు హోరుగాలి అని తెలుసూ... అటు వరద పొంగు అని తెలుసూ...
హోరుగాలిలో వరదపొంగులో సాగలేనని తెలుసు
అది జోరువాన అని తెలుసూ... ఇవి నీటి సుడులని తెలుసూ...
అది జోరువాన అని తెలుసూ... ఇవి నీటి సుడులని తెలుసూ...
జోరువానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు
ఐనా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం

ఇది ఆశ నిరాశల ఆరాటం... అది చీకటి వెలుగుల చెలగాటం...
ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలగినా ఆగదు జీవిత పోరాటం
ఇది మనిషి మనసుల పోరాటం... అది ప్రేమ పెళ్ళి చెలగాటం...
ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్న దొక శవం
ఐనా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
SwayamVaram Songs Lyrics
Gali vanalo vana neetilo song lyrics in telugu language
Lyrics : Dasari NarayanaRao
Playback : K.J.Yesudas
Music : Sathyam
ADVERTISEMENTS