SONGS ARCHIVE
నీ జతగా నేనుండాలి
Evadu
Movie ఎవడు
Star Cast రామ్ చరణ్ తేజ, శృతి హాసన్, అమీ జాక్సన్
Year 2013
Lyricist సిరివెన్నెల
Singer(s) కార్తీక్, శ్రేయాఘోషల్
Music దేవిశ్రీ ప్రసాద్


నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే....
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే....
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా
రాలేదే.. జాడైనా లేదే..
రెప్పల బైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే.. పైగా తిడతావే..
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా...
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా.. ఆ.. ఆ.. ఆ...
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలీ...

తెలిసీ తెలియక వాలింది నీ నడువొంపుల్లో నలిగింది
నా చూపూ.. ఏం చేస్తాం చెప్పూ..
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది
నీ వైపూ.. నీదే ఆ తప్పూ..
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా..
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా.. ఆ.. ఆ.. ఆ...
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలీ...
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ...
Nee jathaga nenundali
Keywords : Vamsi Paidipally, Devisri Prasad, Ramcharan Teja, Shruthi Hasan, Amy Jackson, Sirivennela, Karthik, Shreyaghoshal
ADVERTISEMENTS