SONGS ARCHIVE
నీ చూపులే నా ఊపిరి
Endukante Premanta
Movie ఎందుకంటే ప్రేమంట
Star Cast రామ్, తమన్నా
Year 2012
Lyricist రామజోగయ్యశాస్త్రి
Singer(s) హరిచరణ్, KS.చిత్ర
Music GV.ప్రకాష్ కుమార్


నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా.... చూడే చెలీ...
అమవాసనై ఉన్నామరి
అందించవే.... దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో
ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును
చూసి చూడవెలా...
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జా...లి చూసె వీలుందంటే
ఈ క్షణాన ఊ..పిరాపనా.....

రోజే కొత్తగా... నీ సందర్శనం
ఆహా అన్నదీ... నాలో స్పందనం
నిత్యం నువ్విలా... నాకై చూడటం
ఎంతో వింతగా... ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే
మురిపిస్తూందే నీ చల్లదనం
ఎద మంటంతా... దాచేస్తూ
వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకవని ఎన్నో జన్మలనీ
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జా...లి చూసె వీలుందంటే
ఈ క్షణాన ఊ..పిరాపనా.....

నీతో బంధమే... రాసిందెవ్వరో
నిన్నే నాకిలా... చూపిందెవ్వరో
నన్నీ వైపుగా...లాగిందెవ్వరో
నిన్నే చూడగా... అపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో
పడి నిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే... వస్తాలే
కలిసే రేపటి పొద్దుల్లో
హా.. నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా.... చూడే చెలీ...
అమవాసనై ఉన్నామరి
అందించవే.... దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా...
నయనం... హృదయం... నీవే... నీవై
సమయం... వెనుకే... చేశా... పయనం
తదుపరి జన్మకైన జా...లి చూసె వీలుందంటే
ఈ క్షణాన ఊ..పిరాపనా.....
Nee choopule naa oopiri
Keywords : Karunakaran, GV.Prakash Kumar, Ram, Tamanna, Ramajogayya Shastry, Haricharan, KS.Chitra
ADVERTISEMENTS